9 కోట్ల రుణం ఇప్పిస్తానంటూ.. 17 లక్షలు స్వాహా
తొమ్మిది కోట్లు రుణంగా ఇప్పిస్తానంటూ నమ్మించి, టీడీఎస్, జీఎస్టీ పేరుతో రూ.17 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్కు చెందిన బాధితుడికి స్నేహితుడి ద్వారా వర్మరాజ్ పేరుతో ఒక వ్యక్తి వాట్సాప్ కాల్లో పరిచయమయ్యాడు
- తమిళనాడు వాసి అరెస్ట్
సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): తొమ్మిది కోట్లు రుణంగా ఇప్పిస్తానంటూ నమ్మించి, టీడీఎస్, జీఎస్టీ పేరుతో రూ.17 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్కు చెందిన బాధితుడికి స్నేహితుడి ద్వారా వర్మరాజ్ పేరుతో ఒక వ్యక్తి వాట్సాప్ కాల్లో పరిచయమయ్యాడు. ఒక్క రూపాయి వడ్డీతో రూ. 9 కోట్లు రుణంగా ఇప్పిస్తానని, ఆధార్‌కార్డు, ప్యాన్, ఇతర బ్యాంకు వివరాలను తీసుకున్నాడు.
లోన్ ఇవ్వాలంటే ముందుగా టీడీఎస్ చెల్లించాలంటూ రూ. 9 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత జీఎస్టీ పేరుతో రూ. 8 లక్షలు వసూలు చేసి, సెల్‌ఫోన్ స్విచాఫ్ చేశాడు. మొత్తం రూ. 17 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ హరికృష్ణ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ ఎం.శంకర్ బృందం కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టింది. నిందితుడు తమిళనాడు, తిరువళ్లూర్‌కు చెందిన రమేశ్ ఎలుమలైగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నగరానికి తరలించారు. కాగా, నిందితుడిపై ఎల్బీనగర్, సైబర్‌క్రైమ్ ఠాణా, కేపీహెచ్బీలో కేసులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

