అమీర్ పేట్, జూన్ 22: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధికి ప్ర త్యేక చర్యలు తీసుకోవడంతో పాటు పదేళ్లపాటు అమ్మవారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించామని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ పద్మశాలి సంఘం నాయకులు జయరాజ్ ఆధ్వర్యంలో కల్యాణోత్సవానికి సంబంధించి ప్రతిఏటా సమర్పించే పోచంపల్లి పట్టు వస్ర్తాలైన మూడు చీరలను మగ్గంపై తయారు చేసే పనులను ఎమ్మెల్యే తలసాని ఆదివారం దేవాలయ ఆవరణలో పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు.. కల్యాణోత్సవ ఏర్పాట్లకు సంబంధించి కల్యాణ టికెట్లు, డోనర్ పాసుల సంఖ్యను గణనీయంగా కు దించిన అంశాలను తలసాని దృ ష్టికి తీసుకువచ్చారు.
కల్యాణోత్సవానికి భక్తుల తాకిడి పెరుగుతోందని, ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి తప్ప, భక్తులను నియంత్రించే పనులు చేయవద్దని ఎమ్మెల్యే తలసాని కోరారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి జులై 2 వ తేదీన పాత బస్తీకి చెందిన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బం గారు బోనం సమర్పిస్తారని ఎమ్మెల్యే తలసాని తెలిపారు. సుమారు 500 మంది వివిధ దేవాలయాలకు చెందిన కమిటీ ప్రతినిధులు అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమం లో పాల్గొంటారని చెప్పారు. మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈవో మహేందర్ గౌడ్, సూపరింటెండెంట్ హైమవతి, హన్మంతరావు, అశోక్ యాదవ్, సంతోష్ కుమార్, నర్సిం హ, బలరాం, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, జయరాజ్ పాల్గొన్నారు.