బన్సీలాల్‌పేట్, జనవరి 27: ఎన్నో ఏండ్లుగా ఫుట్‌పాత్‌లపై వ్యాపారమే జీవనాధారంగా ఉంటున్న వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పద్మారావునగర్‌లోని ఫుట్‌పాత్ వ్యాపారులు, పార్కు వాకర్స్ కమిటీ ప్రతినిధులతో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సరైన మార్గదర్శకాలతో వారికి వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని ఆయన అధికారులను కోరారు. లక్షలాది రూపాయలను వెచ్చించి పద్మారావునగర్ పార్కును అభివృద్ధి పరిచామని, తద్వారా వాకర్స్ సంఖ్య కూడా పెరిగిందన్నారు.
కాబట్టి, పార్కుకు వచ్చే వాకర్స్‌కు గాని, కాలనీ ప్రజలకు గాని ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు. వాహనాల పార్కింగ్ సక్రమంగా పెట్టాలని, ఇష్ట్టానుసారంగా దుకాణాలను పెట్టకూడదని ఆయన వ్యాపారులను ఆదేశించారు. బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కే.హేమలత, జీహెచ్ఎంసీ డీసీ సమ్మయ్య, ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, జల మండలి జీఎం వినోద్ కుమార్, హార్టికల్చర్ అధికారి గణేశ్, పార్కు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.బాల్‌రెడ్డి, బీఅర్ఎస్ నాయకులు జి.పవన్ కుమార్ గౌడ్, వెంకటేశన్ రాజు, కే.లక్ష్మీపతి, ఏసూరి మహేశ్, శ్రీకాంత్ రెడ్డి, పుశ్వంత్ రెడ్డి, ముక్క శ్రీను, ఆంబులెన్స్ సురేశ్, ప్రేమ్ కుమార్, గజ్జెల శ్రీను, కుశాల్, మహేందర్, చక్రధర్ యాదవ్, సుధాకర్ రెడ్డి, హరిచారి, హమ్రాజ్ పాల్గొన్నారు.