Talasani Srinivas Yadav | రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే సోయి మరిచి బూతులు మాట్లాడటం మానుకో..నోటి దురద తగ్గించుకో అని బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. గురువారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టిమ్స్ హాస్పిటల్ పనులు కేసీఆర్ ప్రభుత్వం లోనే ప్రారంభించాం. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిబ్బన్ లు కటింగ్ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఎదుటి వారికి గౌరవం ఇచ్చి మాట్లాడాలి అన్న సోయి కూడా ముఖ్యమంత్రికి లేదన్నారు. మహంకాళి జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తే స్థానిక ఎమ్మెల్యేగా గౌరవించి స్వాగతం పలికిన. కరోనా సమయంలో ఎదురైన పరిస్థితులను దృష్టి లో ఉంచుకొని భవిష్యత్ అవసరాల దృష్ట్యా సనత్ నగర్, అల్వాల్, కొత్తపేట లలో టిమ్స్ హాస్పిటల్ కు కేసీఆర్ శంకుస్థాపన చేశారన్నారు.
మంది పిల్లలను మా పిల్లలుగా మేము చెప్పుకోము. మా ప్రభుత్వంలో 60 శాతం పనులు జరిగాయి. పనులు పూర్తి కాకుండా, సౌకర్యాలు కల్పించకుండానే హడావుడిగా హాస్పిటల్ ను ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. హాస్పిటల్ సందర్శిస్తామంటే హౌస్ అరెస్ట్ లు ఎందుకు చేశారు.. ఎందుకు అంత భయం అన్నారు. 22 ఏ తీసుకొచ్చింది మీరు కాదా? పొరపాటు జరిగాయని మంత్రి క్షమాపణ చెప్పడం అంతా డ్రామా. 22 ఏ ను అడ్డం పెట్టుకొని 30 నుండి 40 శాతం కమిషన్ లు వసూలు సెటిల్ మెంట్ లు చేయలేదా? ప్రైవేట్ భూములు, పేదల ఇండ్లను 22 ఏ లో చేర్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారన్నారు.ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.