మారేడ్పల్లి, సెప్టెంబర్ 12: బీఆర్ఎస్ హయాంలోనే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మోండా డివిజన్లో రూ. కోటి 34 లక్షలతో (బండిమెట్, జైన్ టెంపుల్, రాజేశ్వరి థియేటర్ వెనుకాల) పలు చోట్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. విద్యుత్ స్తంభాల పై కేబుల్ వైర్లు కిందకు వేలాడుతూ ప్రమాదం పొంచి ఉందని వివరించారు.
ఎమ్మెల్యే వెంటనే కేబుల్ వైర్లను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. తాను గతంలో ఈ ప్రాంతం లో పర్యటించి స్థాని కుల సమస్యలను తెలుసుకున్నట్లు తెలి పా రు.
ఆ సమయంలో బండిమెంట్ ప్రాం తంలో డ్రైనేజీ, రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వారి సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ లైన్లను నిర్మించామని, నేడు నూతన రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్, కార్పొరేటర్ కొంతం దీపిక, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, డీఈ మహేశ్, వాటర్ వర్క్స్ డీజీఎం ఆశిష్, శానిటేషన్ డీఈ వెంకటేశ్, ఎలక్ట్రికల్ ఏఈ వరలక్ష్మి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు పాల్గొన్నారు.