హైదరాబాద్ : ఆర్టీసీని ప్రయివేట్ పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాణి గంజ్ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలో పాల్గొని సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే ఆర్టీసీ ఉద్యోగులు అమలు చేయాలని కోరుతున్నారు. సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. 92 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఆర్టీసీ మనుగడకు ప్రభుత్వం ముప్పు తలపెడుతుందని ఆరోపించారు.
ఆర్టీసీ అభివృద్ధిలో ఉద్యోగుల శ్రమ, కృషి వెలకట్టలేనిదన్నారు. ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చి ఆర్టీసీ ఉద్యోగులను రోడ్డున పడేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. ఎలెక్ట్రికల్ బస్సులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతోనే నడపాలి. బీఆర్ఎస్ నేతల ప్రోద్బలంతనే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని మంత్రులు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటానికి సిగ్గుండాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్స్ అమలయ్యే వరకుకు బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు.