ఎల్లమ్మ కల్యాణాన్ని విజయవంతం చేయాలి
ఈ నెల 21న జరిగే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ ఏర్పాట్లకు సంబంధించి సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ వివిధ విభాగాల అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశం వాడిగా వేడిగా సాగింది. కొద్ది రోజుల క్రితం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికార యంత్రాంగంతో కలిసి నిర్వహించిన సమీక్షకు పూర్తి భిన్నంగా శనివారం నాడు ఎమ్మెల్యే తలసాని సమీక్ష కొనసాగింది.
- ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్
అమీర్‌పేట్,జూలై 18:ఈ నెల 21న జరిగే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ ఏర్పాట్లకు సంబంధించి సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ వివిధ విభాగాల అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశం వాడిగా వేడిగా సాగింది. కొద్ది రోజుల క్రితం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికార యంత్రాంగంతో కలిసి నిర్వహించిన సమీక్షకు పూర్తి భిన్నంగా శనివారం నాడు ఎమ్మెల్యే తలసాని సమీక్ష కొనసాగింది. ఎల్లమ్మ కల్యాణోత్పవంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములయ్యే భక్తులు, స్థానికులు తమ ఇబ్బందులు చెప్పుకునే అవకాశం లభించడంతో సమీక్ష అర్ధవంతంగా సాగింది.
సమీక్షలో పాల్గొన్న అధికారులకు కూడా స్థానికుల సమస్యలను పరిగణనలోకి తీసుకునే అవకాశం కలిగింది. వేడుకల విజయవంతానికి ఎప్పటిలాగే బల్కంపేట వాసులు వివాదాలకు అతీతంగా అంతా ఏకమై విజయవంతం చేయాలన్నారు. శనివారం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ ఆవరణలో దేవాలయ ఛైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్, ఈవో వినోద్‌రెడ్డి, జీహెచ్ఎంసీ అమీర్‌పేట్ డిప్యూటీ కమిషనర్ సుజాత, ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు.
కల్యాణోత్సవాన్ని పపురస్కరించుకుని మంగళ, బుధవారాల్లో జరిగే వేడుకలకు పోలీసుల బందోబస్తు, సీసీ కెమెరాల పనితీరు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేపడుతున్న చర్యలపై ఎమ్మెల్యే పోలీసులను అధికారుల నుండి వివరాలు తీసుకున్నారు. అమ్మవారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు రెండు రోజుల్లో దాదాపు 7 లక్షల మంది భక్తులు దేవాలయానికి తరలివస్తారని, భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న అధికార యంత్రాంగానికి వివదాలకు అతీతంగా బల్కంపేట వాసులు, వివిధ పక్షాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, వలంటీర్లు తమ చేయూతనందించాలన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

