వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 1: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పెంపుడు జంతువుల పట్ల దిగులువద్దని, అయితే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఆసుపత్రి చికిత్స విభాగం హెడ్ డాక్టర్ రామ్‌సింగ్ సూచించారు. ఇటీవల రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ప్రధానంగా అక్కడక్కడ వర్షాలు పడటం ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులతో పెంపుడు జంతువుల్లో ప్రధానంగా ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లులు, ఆరోగ్యం పరిస్థితులు నెలకొన్నాయని, వాటి పట్ల దిగులు చెందాల్సిన అవసరంలేదని, అయితే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
కనీసం సమీపంలోని వెటర్నరీ ఆసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకోవాలని, ప్రస్తుతం నట్టలు నివారణ, సమీకృత ఆహారం, పెంపుడు కుక్కలకు ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత వరకు మాంసాహారాన్ని తగ్గించి, శాఖాహారాన్ని ఇవ్వడంతోపాటు వాటిని శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. అస్వస్థతకు గురైతే ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించవద్దని, వీలైతే రాజేంద్రనగర్‌లోని అధునాతన పరికరాలతో ఉన్న ఆసుపత్రిని సంప్రదించాలని ఆయన సూచించారు.