అనుమానమే చంపేసింది..!
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మద్యం సేవించి వచ్చి దాడిచేయడంతో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
మన్సూరాబాద్, సెప్టెంబర్ 1 : భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మద్యం సేవించి వచ్చి దాడిచేయడంతో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్, అల్తాఫ్నగర్లో నివాసముండే దాసరి సురేందర్ అలియాస్ మొయిన్ మీర్పేట్, నందనవనం కాలనీలో నివాసముండే సబాఫాతిమా (18)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి తొమ్మిది నెలల పాప ఉన్నది. అయితే మొయిన్‌ను 2021 డిసెంబర్లో ఓ దొంగతనం కేసులో బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
జైలు నుంచి జూలై 2022లో విడుదలయ్యాడు. కాగా భార్యపై అనుమానం పెంచుకున్న మొయిన్ మద్యం సేవించి వచ్చి వేధించసాగాడు. ఆగస్టు 30న అర్ధరాత్రి మొయిన్ మద్యం సేవించి వచ్చి ఫాతిమాపై దాడి చేయగా తీవ్ర గాయాలు కావడంతో దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ 31న మృతి చెందింది. ఫాతిమా తల్లి షాబనాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త మొయిన్, అత్త యాదమ్మ, కీర్తిని అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారుతరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Husband
- Hyderabad
- kill
- suspicious
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

