Secunderabad | సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో బాంబు పెట్టినట్లు ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని మోండా మార్కెట్ పోలీసులు అరెస్టు చేశారు. గౌస్ పాషా అనే వ్యక్తిని ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నారు.
ఆల్ఫా హోటల్లో బాంబు పెట్టినట్లుగా డయల్ 100కి శనివారం ఒక బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు.. బాంబ్ స్క్వాడ్‌తో హోటల్లో మొత్తం తనిఖీ చేశారు. ఎటువంటి పేలుడు పదార్థాలు దొరక్కపోవడంతో పోలీసులు ఫేక్ కాల్‌గా నిర్ధారించారు. దీంతో కేసు నమోదు చేసుకున్ను పోలీసులు ఫేక్ కాల్ చేసిన వ్యక్తి కోసం దర్యాప్తు చేపట్టారు. నిందితుడు గౌస్ పాషానే ఫేక్ కాల్ చేసినట్లు గుర్తించి.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.