సిటీబ్యూరో: హైదరాబాద్లో రియల్ రంగం కుదేలైందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ వెల్లడించిన విస్మయకర వాస్తవాలను ‘నమస్తే’ శుక్రవారం ‘అట్టడుగుకు రియల్టీ’ శీర్శికన ప్రచురించిన కథనంపై తెలంగాణలో విస్తృత చర్చకు దారితీసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సంబంధీకులు ఈ కథనంపై జోరుగా చర్చిస్తున్నారు. వారి రియల్ ఎస్టేట్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు. నగరంలో ఏకంగా 49 శాతం మేర ఇండ్ల అమ్మకాలు పడిపోయాయని, దేశంలో అన్ని మెట్రో నగరాల్లో కంటే హైదరాబాదే అట్టడుగులో ఉందని తేల్చడంతో వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది.
మరోవైపు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘కొలియర్స్ ఇండియా’ విడుదల చేసిన నివేదికలో టాప్ 7నగరాల్లో స్థూలంగా 159 లక్షల చదరపు అడుగు మేర(ఎస్ఎఫ్టీ) ఆఫీస్ లీజింగ్ లావాదేవీలు జరిగాయని తేల్చింది. కానీ హైదరాబాద్లో మాత్రం 17 లక్షల చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు మాత్రమే జరిగాయి. గతేడాది మొదటి మూడు నెలల్లో లీజింగ్ 29 లక్షలతో పోల్చి చూస్తే ఇప్పుడు 41 శాతం తగ్గినట్టు నివేదిక పేర్కొంది.