ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది.
మరోవైపు మ్యాచ్‌ను చూసేందుకు క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో మైదానంలో సందడి వాతావరణం నెలకొన్నది. మ్యాచ్ సాగుతున్నంత సేపు.. ప్రేక్షకులు కేరింతలు కొడుతూ.. తమ అభిమాన క్రీడాకారులను ఉత్సాహపరిచారు.