హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. సికింద్రాబాద్, పంజాగుట్ట, గోల్కొండ, మెహదీపట్నం, కార్వాన్, నారాయణ గూడ, హిమాయత్ నగర్, అత్తాపూర్, ఉప్పరపల్లి, హైదర్గూడ, రాజేంద్రనగర్, గండీపేట్, శంషాబాద్, పాతబస్తీలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే సమయంలో ఇలా వర్షం కురవడంతో వాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు.