Hyderabad | హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడిమితో ఉక్కపోతగా ఉండగా.. ఉన్నపళంగా వాతావరణం మొత్తం చల్లబడింది. దీంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఖైరతాబాద్, ఆబిడ్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, బోరబండ, యూసుఫ్‌గూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్లో వర్షం కురిసింది.
హైదరాబాద్‌తో పాటు నల్గొండ జిల్లాలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కాగా, ఇవాళ రాత్రి వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
#WATCH | Telangana | Rain lashes parts of Hyderabad city. pic.twitter.com/FC1Ga9pROi
— ANI (@ANI) June 7, 2025