Drugs | ఖైరతాబాద్, మార్చి 15 : మాదక ద్రవ్యాలకు చదువుకునే పిల్లలు దూరంగా ఉండాలని తెలంగాణ యాంటి నార్కోటిక్ బ్యూరో డీఎస్సీ నర్సింగ రావు సూచించారు. శనివారం సోమాజిగూడలోని రాజ్ భవన్ హైస్కూల్లో టీన్యాబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సింగ రావు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో మాదకద్రవ్యాలు పాఠశాలల్లోకి ప్రవేశించాయని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. తల్లిదండ్రులు కొంత సమయాన్ని తమ పిల్లల కోసం కేటాయించాలని, వారి దినచర్యను గమనిస్తూ ఉండాలన్నారు. ఎవరైనా మాధకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లయితే వెంటనే 1908 నంబరుకు సమాచారం అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో టీన్యాబ్ కోఆర్డినేటర్ కల్యాణి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు, విద్యాశాఖ సెక్టార్ అధికారి కనీస్ ఫాతిమా, పాఠశాల ఇంచార్జి హెచ్ఎం గోపాల్, ఉపాధ్యాయులు వీర్కొండ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.