ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుల కొరతపై విద్యార్థులు నిరసన తెలిపారు. తక్షణమే అధ్యాపకులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమకు పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు లేరని ఆరోపిస్తూ ఓయూ పరిపాలనా భవనం ఎదుట ధర్నా చేశారు. ఓయూ టెక్నాలజీ కళాశాలలో ఫుడ్ టెక్నాలజీ విభాగంలో ఒక్క ప్రొఫెసర్ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం దాదాపు నాలుగు వందల మంది విద్యార్థులు ఉన్నా.. పక్క విభాగం ప్రొఫెసర్‌ను తమ విభాగానికి హెడ్‌గా నియమించారని మండిపడ్డారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు పరిపాలనా భవనానికి రాగా, భద్రతా సిబ్బంది అడ్డకున్నారన్నారు. అందుకే భవనం గేటు ఎదుట ధర్నా చేసినట్లు చెప్పారు.
-ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 5