సిటీబ్యూరో/కొండాపూర్/శేరిలింగంపల్లి, మార్చి 30: ఉగాది పర్వదినాన గచ్చిబౌలిలోని హైదరాబాద్ ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీలోని 400 ఎకరాల భూమిని వేలం వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన భూమిని చదును చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈస్ట్ పోలీసులను మొహరింపజేసింది. దీంతో పాటు జేసీబీలను క్యాంపస్ తీసుకువచ్చింది. విషయం తెలుసుకున్న విద్యార్థులు వెంటనే ఈస్ట్ ఆందోళన చేపట్టారు.
దీంతో పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఈడ్చుకువెళ్లి వ్యాన్ మాదాపూర్ గచ్చిబౌలి, రాయదుర్గం, కొల్లూరు పోలీస్ తరలించారు. విద్యార్ధినుల జుట్లు పట్టుకొని, బట్టలు చిరిగిపోయిన వదలకుండా లాక్కెళ్లి పోలీస్ స్టేషన్ తరలించారు. విచక్షణ కోల్పోయిన పోలీసులు.. ఇతర రాషా్ర్టల విద్యార్థులు కావడంతో బూతులు తిట్టినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఈస్ట్ ఉద్రిక్తం
ఆదివారం సెలవు దినం కావడంతో విద్యార్థులందరూ హాస్టల్స్ పరిమితమయ్యారు. మధ్యాహ్నం ప్రభుత్వం ఈస్ట్ భారీగా పోలీసులను మొహరింపజేసి, 400 ఎకరాల భూమిని చదును చేసేందుకు జేసీబీలు, ట్రక్కులతో సిద్ధమైంది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
సెలవులు ఉన్నాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అడవిని నాశనం చేస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భూముల వేలాన్ని నిలిపివేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళన చేపట్టిన విద్యార్థులను ఈడ్చుకువెళ్లారు. మహిళా విద్యార్ధినులని చూడకుండా మహిళా పోలీసులు జుట్టు పట్టుకొని లాక్కెళ్లి వ్యాన్లలో ఎక్కించారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. 52 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకొని వాహనాల్లో పలు పీఎస్ తరలించారు.
మెయిన్ గేట్ తాళం..
విషయం తెలుసుకున్న క్యాంపస్ తోటి విద్యార్థులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హెచ్ మెయిన్ చేరుకున్నారు. అప్పటికే పోలీసులు క్యాంపస్ మెయిన్ గేట్ కు తాళం బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా ఆందోళన చేయనీయరా అంటూ ప్రశ్నిస్తూ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. అరెస్ట్ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఆదోళన చేపట్టారు. పరిస్థితిని మాదాపూర్ వినీత్ సమీక్షించారు.
వర్సిటీ భూములను యూనివర్సిటీ పేరుపై రిజిస్ట్రేషన్ డిమాండ్ ఆందోళన చేపట్టిన విద్యార్థులను గుంట నక్కలు అంటూ సీఎం రేవంత్అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలన్నారు. అరెస్ట్ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ డిమాండ్లను నేరవేర్చేవరకూ తమ ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. దీంతో పోలీసులు విద్యార్థులను విడుదల చేస్తామంటూ హామీ ఇవ్వడంతో శాంతించారు.
హెచ్సీయూ విద్యార్థులకు పరామర్శ
మాదాపూర్, మార్చి30: గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై ఆదివారం విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం యంత్రాలతో వర్సిటీ భూములను నాశనం చేసేందుకు వస్తే.. అడ్డుకున్నందుకు విద్యార్థి సంఘాలు నాయకులపై విరుచుకుపడ్డారు. గచ్చిబౌలి పోలీసులు 22 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, విద్యార్థి నాయకులు పీఎస్కు చేరుకొని విద్యార్థులను కలిసి మాట్లాడారు.
ప్రభుత్వం వర్సిటీ భూములను ధ్వంసం చేయడం బాధాకరమని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ అన్నారు. పచ్చని అడవులను, కొండలను నాశనం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటుందని, అడ్డుకోబోయిన విద్యార్థులను అక్రమంగా అరెస్టులు చేసి పీఎస్కు తరలించడం అన్యాయమని అన్నారు. విద్యార్థులను తక్షణమే వదిలిపెట్టాలని, ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కాగా విద్యార్థులను పంపివేస్తున్నట్లు మాదాపూర్ సీఐ కృష్ణమోహన్ తెలిపారు.
భూముల కోసమే సీఎం వద్ద విద్యాశాఖ
సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): వర్సిటీ భూములను అమ్ముకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖను పెట్టుకున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఆయన ఆదేశాలతోనే వర్సిటీల్లో పోలీసుల రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. ఆదివారం విద్యార్థుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. మరో 200 మందిని అరెస్టు చేసే ప్రయత్నాలను మానుకోవాలని భారత విద్యార్థి సమాఖ్య(ఎస్ఎఫ్ఐ) ఆందోళన వ్యక్తం చేసింది. భూముల పరిరక్షణ, విద్యార్థుల అక్రమ అరెస్టుకు నిరసిస్తూ రాష్ట్రస్థాయి ఆందోళనకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి.నాగరాజు పిలుపునిచ్చిచ్చారు.
సెలవు రోజు ఎందుకొచ్చారు..
వరుస సెలువులు వచ్చిన నేపథ్యంలో విద్యార్థులందరూ క్యాంపస్ పరిమితం అయ్యాం. మధ్యాహ్నంలో ఈస్ట్ భారీగా పోలీసులు చేరుకొని జేసీబీలతో భూమిని చదును ప్రయత్నిస్తున్నారు. అడ్డుకునేందుకు వెళ్లిన తమ స్టూడెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెలవు రోజు, అడ్మినిస్ట్రేషన్ ఎవరూ లేని సమయంలో ఎందుకు వచ్చారని పోలీసులను ప్రశ్నిస్తుండగానే అమ్మాయిలు అని చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కెళ్లి పోలీస్ కుక్కారు. కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. క్యాంపస్ మోహరించిన పోలీసులు, భూమిని చదును చేసేందుకు వచ్చిన జేసీబీలు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలి.
– వెన్నెల, హెచ్సీయూ విద్యార్థిని
భూములను వర్సిటీ పేరుపై రిజిస్ట్రేషన్
ముఖ్యమంత్రి రేవంత్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. సెలవు రోజున విద్యార్థులు లేని సమయంలో క్యాంపస్ భారీగా పోలీసులను తీసుకువచ్చి జేసీబీలతో భూమిని చదును చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులను కొట్టుకుంటూ, బట్టలు చింపేసి.. లాక్కెళ్లి వ్యాన్ ఎక్కించి పోలీస్ తరలించారు. పోలీసులు అరెస్ట్ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి. 400ల ఎకరాల భూమితో పాటు హెచ్ భూములను వర్సిటీ పేరుపై రిజిస్ట్రేషన్
– భీంసేన్ హెచ్సీయూ విద్యార్థి