చెందిన ఓ విద్యార్థినికి వాట్సాప్ నంబర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. మీ స్నేహితురాలు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది.. ఈ కేసులో మీ ప్రమేయం ఉన్నట్లు ఆమె ఫోన్లో ఆధారాలు లభించాయి అంటూ ఆగంతకులు బెదిరించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏ క్షణంలో అయినా మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశముందని, తప్పు చేయలేదని 24 గంటల్లో నిరూపించుకోవాలంటూ చెప్పారు. ఈ కాల్‌తో భయపడిన ఆమె తన తండ్రికి చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు.
చెందిన ఓ యువతికి తెలియని నంబర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. అమెరికాలో ఉన్న మీ స్నేహితులు అక్రమ నగదు లావాదేవీల్లో పట్టుబడ్డారు. వారు ఆ డబ్బును మీ బ్యాంక్ ఖాతాకు పంపినట్లు మాకు సమాచారం ఉంది.. మీ బ్యాంక్ ఖాతాను చెక్ చేయాలంటూ ఒక ఏపీకే ఫైల్ పంపారు. దానిద్వారా బాధితురాలి ఫోన్‌ను హ్యాక్ చేసి 2.50 లక్షలు కొట్టేశారు.
Cyber Crime | సిటీబ్యూరో, మార్చి7(నమస్తే తెలంగాణ): నగరంలో ఇలాంటి ఘటనలు నెలలో రెండుమూడుకు పైగా జరుగుతూనే ఉన్నా యి. ఈ విధంగా మోసపోతున్నవారిలో విద్యాధికులే ఎక్కువగా ఉంటున్నారు. వారిలో కూడా యువతులే ఎక్కువగా ఉండడం గమనార్హం. వారిని టార్గెట్ చేసి బెదిరించి ..వారి నుంచి డబ్బులు లాగడమే లక్ష్యంగా మోసగాళ్లు ప్లాన్ చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు విద్యార్థినులు, యువతులు టార్గెట్‌గా కొత్త పంథాలో మోసం చేస్తున్నారు. తమ స్నేహితులు విదేశాల్లో ఉండడమో, ఇంకెక్కడో ఉన్నవారి వివరాలను సేకరించి ..వారిపేరు చెప్పి వాళ్లు ఒక పెద్ద కేసులో ఇరుక్కున్నారు.. వారి వద్ద మీ డేటా ఉంది.. మీరు కూడా వారికి సహకరించారంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
అమ్మాయిలు వాట్సాప్ కాల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. తెలియని వ్యక్తులు, సంస్థల పేరుతో వచ్చే కాల్స్‌కు స్పందించవద్దని, ఒకవేళ బెదిరించినట్లు కాల్ వస్తే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.