Hyderabad | హైదరాబాద్‌లో మరో బాలుడిపై వీధి కుక్కలు దాడికి తెగబడ్డాయి. యూసుఫ్‌గూడ పరిధిలోని శ్రీలక్ష్మీనరసింహనగర్లో ఇంటి ముందు ఆడుకుంటున్న మాన్వీత్ నందన్ అనే రెండేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడికి దిగింది. చిన్నారి చేతిని కరిచే ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న బాలుడి తాత అప్రమత్తమై కర్రతో కొట్టడంతో వీధికుక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం గాయాలపాలైన బాలుడిని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, వీధికుక్కల విజృంభణపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో వీధి కుక్కల దాడులు జరుగుతున్నా, ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
హైదరాబాద్‌లో మరో బాలుడిపై వీధి కుక్కల దాడి
యూసుఫ్‌గూడ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహ నగర్ ప్రాంతంలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై దాడి చేసిన వీధి కుక్క
గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు
నగరంలో వరుసగా వీధి కుక్కల దాడులు జరుగుతున్నా,… pic.twitter.com/Ak9i7xaQyd
— Telugu Scribe (@TeluguScribe) December 5, 2025