జూబ్లీహిల్స్, డిసెంబర్ 5: యూసుఫ్‌గూడ లక్ష్మీనరసింహనగర్‌లో మాన్విక్ నందన్ (2) అనే బాలుడు రోడ్డుపై ఆడుకుంటుండగా వీధి కుక్క దాడిచేసింది. బాలుడి తాత అప్రమత్తమై కర్రతో కొట్టడంతో పారిపోయింది.
ఈ ఘటన సీసీ కెమెరాలో నమోదు కాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడిని తక్షణమే వైద్య చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తమ కుమారుడు మాన్విక్ నందన్ క్షేమంగా ఉన్నట్లు తల్లిదండ్రులు సురేశ్, శ్వేత తెలిపారు.