Cellar | కొండాపూర్, ఫిబ్రవరి 6: ప్రమాదకర రీతిలో ఇష్టానుసారంగా సెల్లార్లను తవ్వుతూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిర్మాణదారులపై తగు చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి తెలిపారు. ఇటీవలే సెల్లార్ కూలిన ఘటనలో ముగ్గురు అమాయకులు ప్రాణాలు విడిచిన విషయాన్ని గుర్తు చేశారు.
చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష హిల్స్ గేట్ నంబర్-1 వద్ద తీసిన సెల్లార్పై చర్యలు తీసుకోవాలంటూ అధికారులను కోరారు. సదరు నిర్మాణదారుడు నెల్లార్కు అనుమతులు తీసుకుని ఇష్టానుసారంగా పక్కనే ఉన్న రోడ్డుకు ఏమాత్రం సెప్టిక్ ట్యాంక్ వదలకుండా తవ్వడంతో రోడ్డుతో పాటు పక్కనే ఉన్న అపార్ట్మెంట్ కంపౌండ్ వాల్ గోడలు కూలిపోయిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకుని సదరు సెల్లార్ల తవ్వకం వెంటనే పూడ్చివేయాల్సిందిగా కోరారు.