Minister Sridhar Babu | హైదరాబాద్/కవాడిగూడ జనవరి 12(నమస్తే తెలంగాణ): అపజయాలకు కుంగిపోవొద్దని.. మీలో ఉన్న శక్తిని గుర్తించి ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు యువతకు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద బోధనలను స్ఫూర్తిగా తీసుకుని లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన సూచించారు. ఆదివారం దోమల్‌గూడలోని రామకృష్ణ మఠ్‌లో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై యువతకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నేటి తరం యువత చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతున్నది.
ఒక అపజయం ఎదురైతే చాలు.. మా వల్ల ఏదీ కాదేమోననే నిరాశ నిసృ్పహలకు లోనవుతున్నారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్లే ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటన్నింటిని ఎదురొని ముందుకు సాగితేనే విజయం దకుతుందని తెలుసుకోవాలి. యువత తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు’ అని అన్నారు. ‘మీ ఆలోచన తీరే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. మీ తల్లిదండ్రులు, గురువులు.. ఇలా ఎవరో ఒకరు వచ్చి చేయి పట్టి నడిపిస్తారనే భావన నుంచి బయటకు రండి. మీ జీవితాన్ని మీరే తీర్చిదిద్దుకోవాలి.
‘యువతను జాగృతం చేసి సన్మార్గం వైపు నడిపించేందుకు రామకృష్ణ మఠ్ చేస్తున్నకృషి అభినందనీయం. యువతలో జాతీయ భావాన్ని పెంపొందిస్తూ.. వారిలో దాగి ఉన్న శక్తిని వెలికి తీస్తుంది. నేను చదువునే రోజుల్లో ఇకడికి అనేక సార్లు వచ్చాను.. ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఉన్నప్పడు వచ్చాను.. ఇప్పుడు వచ్చాను.. ఇకడికొచ్చిన ప్రతిసారి నాలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది..ఆ ఎనర్జీ నన్ను నా లక్ష్యం వైపుకు నడిపిస్తుంది’ అని మంత్రి వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ తమిళ మ్యాగజైన్ ‘తుగ్లక్’ మ్యాగజైన్ ఎడిటర్ గురుమూర్తి, రామకృష్ణ మఠ్ అధ్యక్షుడు స్వామి బోధమయానందా జీ తదితరులు పాల్గొన్నారు.