బొల్లారం : సీఎం కేసీఆర్ భవన నిర్మాణ కార్మికులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని టీఆర్ ఎస్ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం తిరుమలగిరిలోని సాయిబాబ హాట్స్లో కార్మికులకు లేబర్ కార్డులతో పాటు ఈశ్రమ్ -కార్డులు పంపీణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని,ఈ అవకాశాన్ని ప్రతి కార్మికుడు సద్వినియోగం చేసుకొని గుర్తింపు కార్డులు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు శ్యామ్ కుమార్ , రాజాసింగ్ , రాజు సాగర్ , రాజు, కే.మోహాన్ , పులేంద్ర, సంతోష్ , నారాయణ, లక్ష్మణ్ , నర్సింహా తదితరులు పాల్గొన్నారు.