మహేశ్వరం, ఆగస్టు 11: గొల్ల కురుమలను ఆదుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గొల్ల కురుమ సంఘం మహేశ్వరం నాయకులు స్థలం, కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరతూ శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గొల్ల కురుమలను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకం తీసుకొచ్చి గొల్ల కురుమలకు తగు న్యాయం చేస్తున్నారని అన్నారు.
అర్హులైన గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని అన్నారు. నియోజకవర్గంలోని గొల్ల కురుమల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని అన్నారు. గొల్ల కురుమలు ఆర్ధికంగా నిలదొక్కుకొని వ్యాపార రంగంలో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, అంబయ్య యాదవ్, మినాజ్ పటేల్, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆనందం, కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్ అలీ, పీఏసీఎస్ డైరెక్టర్లు పొల్కం బాలయ్య, కడమోని ప్రభాకర్ మహేశ్వరం గ్రామ శాఖ అధక్షుడు దుడ్డు కృష్ణాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.