Star Fish | హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీగా నక్షత్ర తాబేళ్లను పోలీసులు సీజ్ చేశారు. వీటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను మేడిపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. నక్షత్ర తాబేళ్లను తరలిస్తున్న వారిని మలక్‌పేటకు చెందిన మహ్మద్ సిరాజ్ అహ్మద్(39), మేడిపల్లికి చెందిన షేక్ జానీ(50)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ కూడా ఆక్వా కల్చర్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా స్టార్ ఫిష్, తాబేళ్లను తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయ్ కుమార్ వద్ద కొనుగోలు చేసినట్లు వారు చెప్పారు. ఇక స్టార్ ఫిష్, తాబేళ్లను హైదరాబాద్‌లో అధిక ధరకు విక్రయించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అహ్మద్, జానీకి హైదరాబాద్‌లో ఆక్వా కల్చర్‌కు సంబంధించిన దుకాణాలు ఉన్నాయి. అయితే తమ షాపులకు వచ్చే కస్టమర్లకు రహస్యంగా వాటిని విక్రయిస్తున్నారని తెలిసిందని స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ డీసీపీ ఏ రమణారెడ్డి తెలిపారు. వీరిద్దరిని అటవీశాఖ అధికారులకు అప్పగించామని పేర్కొన్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద నిందితులపై కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | మహిళలను నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. ఎమ్మెల్సీ కవిత ధ్వజం
Aamir Khan | నేను రాత్రంతా తాగేవాడిని.. తన వ్యసనాల గురించి అమీర్‌ఖాన్ షాకింగ్ కామెంట్స్