మా భూములు కాపాడండి
గోపాల్నగర్లోని యూఎల్సీ భూముల్లో వెలసిన ప్లాట్లను మూకుమ్మడిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. కాలనీ అధ్యక్షుడిగా చెలామణి అవుతున్న ఓ వ్యక్తి తన వర్గానికి ఆ భూములను కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నాడు.
కేపీహెచ్బీ కాలనీ: గోపాల్నగర్లోని యూఎల్సీ భూముల్లో వెలసిన ప్లాట్లను మూకుమ్మడిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. కాలనీ అధ్యక్షుడిగా చెలామణి అవుతున్న ఓ వ్యక్తి తన వర్గానికి ఆ భూములను కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నాడు. వివాదాస్పద ప్లాట్లుగా ముద్రవేసిన యూఎల్సీ భూముల పరిధిలోకి వచ్చే ప్లాట్లను కేవలం లక్ష రూపాయల అడ్వాన్స్ పేమెంట్తో సుమారు ఐదు కోట్ల విలువైన ప్లాట్లను అగ్రిమెంట్ల రూపంలో కట్టబెట్టే కుట్రను వేగవంతంగా అమలు చేస్తున్నారు.
ఆదివారం ప్లాట్స్ ఓనర్స్తో కాలనీ అసోసియేషన్ నేతలు సమావేశం ఏర్పాటు చేయడానికి నిర్ణయించడంతో.. కొందరు బాధిత ప్లాట్ల ఓనర్స్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును సంప్రదించారు. గోపాల్నగర్లో 130 ప్లాట్లు యూఎల్సీ భూముల పరిధిలో ఉన్నాయి. ఈ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయొద్దని రెవెన్యూ అధికారులు బోర్టులు ఏర్పాటు చేశారు.
కాగా, కాలనీ అసోసియేషన్ పేరుతో కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్లాట్ల యజమానుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన అసోసియేషన్ నేతలు న్యాయ పోరాటం పేరుతో వాటిని కరగదీశారు. చివరకు కోర్టు తీర్పు ప్లాట్స్ ఓనర్స్కు అనుకులంగా రాగా.. ప్రభుత్వం అట్టి హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెల్లింది. ఈ అవకాశాన్ని అదునుగా తీసుకున్న అసోసియేషన్ నేతలు.. ప్లాట్ల యజమానులకు పూర్తి ఫలితం దక్కకుండా తన వర్గం వారికే ఫలితం దక్కేలా పావులు కదుపుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

