సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో శ్రీచైతన్య స్కూల్ 498 మార్కులతో మరోసారి ఆలిండియా నెం.1గా నిలిచి రికార్డు సృష్టించిందని ఆ స్కూల్ డైరెక్టర్ సీమ వెల్లడించారు. ఆరుగురు విద్యార్థులు 497 మార్కులు ఆపైన, 197 మంది విద్యార్థులు 490 మార్కులు ఆపైన, 480 మార్కులు ఆపైన 917 మంది విద్యార్థులు సాధించగా, అత్యధిక బ్రాంచీలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయన్నారు. శ్రీచైతన్య స్కూల్ కల్గిన మెజారిటీ రాష్ర్టాలలో స్టేట్ టాప్ మార్కులతో పాటు అత్యధిక యావరేజ్, పాస్ పర్సంటేజ్‌తో ఆలిండియాలోనే కాదు, ఆయా రాష్ర్టాలలో కూడా చైతన్య స్కూల్ నెం.1గా నిలిచిందని సీమా చెప్పారు.
టాప్ మార్కులలోను, ఉత్తీర్ణత శాతం, సగటు మార్కులలో ఏ ఇతర విద్యా సంస్థలు చైతన్య సాధించిన ఫలితాలను సాధించలేకపోయాయని అన్నారు. ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఆలిండియా ఓపెన్ కేటగిరిలో ఫస్ట్ ర్యాంకుతో పాటు 100 లోపు ర్యాంకులు 19 మంది శ్రీచైతన్య సాధించిందని ఆమె తెలిపారు. ప్రతి విద్యార్తిపై వ్యక్తిగత శ్రద్ద, రీసెర్చ్ ఓరియెంటెడ్ టీచింగ్ మెథడాలజీ, సీఓ-ఐపీయల్, సి-ఐపీయల్, యమ్పీయల్, సి-బ్యాచ్, యస్-బ్యాచ్, టెక్నో వంటి పటిష్టమైన అకాడమిక్ ప్రోగ్రామ్స్, మైక్రో లెవల్ టీచింగ్ సిస్టమ్‌తో పాటు అంకిత భావంతో పనిచేసే అధ్యాపకుల వల్ల మాత్రమే ఇలాంటి అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయని డైరెక్టర్ సీమ తెలిపారు. ఇంతటి అనితర సాధ్యమైన విజయానికి కారణమైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి శ్రీచైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ నాగేంద్ర అభినందనలు తెలిపారు.