హైదరాబాద్ : హైడ్రా కూల్చివేతల(Hydra demolitions) భయంతోనే గంధ శ్రీకుమార్ గుండెపోటుతో(Heart attack) మృతి (Sreekumar) చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డినే బాధ్యుడన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..40, 50 ఏండ్ల నుంచి ఇక్కడే ఉన్నాం. పుల్ల పుల్ల ఏరుకొని ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు సడెన్గా వచ్చి ఇంట్లో నుంచి వెళ్లమనడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఇల్లు కట్టుకున్న అప్పులు కూడా తీర్చలేదు. దీంతో అప్పులు ఇచ్చిన వాళ్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాకు డబుల్ బెడ్ రూం ఇండ్లు వద్దు. ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు.
సెట్రింగ్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న శ్రీకుమార్ ఇల్లు పోతుందనే భయంతో గుండెపోటుతో చనిపోయాడు. రేపు ఇంకెవరైనా కావచ్చు. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ వచ్చి మాకు భరోసా కల్పించారన్నారు. ఇల్లు లేని వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వమనండి. అంతేకాని ఉన్న ఇల్లును కూల్చివేసి మమ్మల్ని అక్కడకు పంపిండమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని చంపినా కూడా ఇక్కడ నుంచి వెళ్లమని తెలిపారు. మాకు ఏ హాని జరిగినా సీఎం రేవంత్ రెడ్డిదే(CM Revanth Reddy) పూర్తి బాధ్యత అన్నారు.
ఇది రేవంత్ రెడ్డి చేసిన హత్య
40, 50 ఏండ్ల నుండి ఇక్కడే ఉన్నాం.. ఇల్లు కూల్చేస్తాం అంటే ఆ బాధలో గుండెపోటు వచ్చింది.
ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యే – మృతుడు కుమార్ కుటుంబసభ్యులు https://t.co/8OETXFKRT0 pic.twitter.com/XXUXXmJNHn
— Telugu Scribe (@TeluguScribe) October 2, 2024