హైదరాబాద్, ఆట ప్రతినిధి డిసెంబర్ 17 : 42వ జాతీయ జూనియర్ రోయింగ్ చాంపియన్‌షిప్‌లో నాలు గు పథకాలతో మెరిసిన తెలంగాణ రోయింగ్ క్రీడా వనితలు. పురుషుల జట్టు ఒక రజితం పతకాన్ని సాధించిం ది. తెలంగాణ రోయింగ్ మహిళల జూనియర్ జట్టు ఒక రజితం, మూడు కాంస్య పతకాలను గెల్చుకుని సత్తాచాటుకున్నారు.
హుస్సేన్‌సాగర్‌లో శనివారం ఇండియన్ రోయింగ్ అసోసియేషన్, తెలంగాణ రోయింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ముగిశాయి. జూనియర్ మహిళల విభాగంలో తెలంగాణ రోయింగ్ జట్టుకు చెందిన బి.హేమలత రజిత పతకాన్ని చేజిక్కించుకున్నారు. మధ్యప్రదేశ్ జట్టుకు చెందిన మోనికా భడోరియా స్వర్ణ పతకాన్ని, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సౌమ్యశ్రీ కాంస్యం దక్కించుకున్నారు. మహిళల కోక్సెడ్ టీమ్ ఎయిట్ రేసులో తమిళనాడు, తెలంగాణ, మణిపూర్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.
తెలంగాణకు చెంది న కె.ఉదయభాను, ఎం.శ్రావ్య, వి.ప్రవళిక, ఎ.మహాలక్ష్మి, కె.నందిని, కె.పూర్ణిఖా, సాయిప్రసన్న, కె.అనురాధల ప్రతిభతో రాణించి రజిత పతకాన్ని అందుకున్నారు. పురుషుల ఎయిట్ రేసులో ఆర్మీ స్పోర్ట్స్ టీమ్, మణిపూర్ జట్లు మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. తెలంగాణ జట్టు మూడో స్థానంలో నిలిచింది.
తెలంగాణ క్రీడాకారులు సీహెచ్.శ్రవణ్‌కుమార్, కె.జ్ఞానేశ్వర్, కె.రాకేశ్, బి.రాజేశ్, కె.సాయి గణేశ్, టి. కార్తీక్, రామకృష్ణ రాణించడంతో కాంస్యం అందుకున్నారు. విజేతలకు కల్నల్ సీపీ.సింగ్ డియో, ఇండియన్ రోయింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు రాజలక్ష్మిసింగ్ డియో, ప్రధాన కార్యదర్శి రామ్, తెలంగాణ రోయింగ్ అసోసియేషన్ కార్యదర్శి ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇస్మాయిల్‌బేగ్ బహుమతులు అందజేశారు.