హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో (Banjara Hills) కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పడడంతో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ పుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. దీంతో పార్కు గోడ ధ్వంసమైంది. కారులో ఉన్న ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగలేదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.