సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రయాణికుల రద్దీ, వేసవి సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి సీహెచ్.రాకేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి రాగ్జల్, సికింద్రాబాద్ నుంచి దలనపూర్ మధ్య జూన్ 3 నుంచి జూన్ 26 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు పేర్కొన్నారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నుంచి కటక్ వరకు సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ మంగళ-బుధ వారాల్లో నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి కటక్ వరకు మే 30 నుంచి జూన్ 27వరకు, కటక్ నుంచి హైదరాబాద్ వరకు మే 31 నుంచి జూన్ 28వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించారు.