KPHB | కేపీహెచ్బీ కాలనీ, మార్చి 13 : వేసవికాలంలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కూకట్పల్లి డీఈ జనప్రియ, ఏడీఈ ప్రసాద్ తెలిపారు. వేసవికాలంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో… అక్కడక్కడ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే కూకట్పల్లి డీఈ 9440813132, ఏడీఈ 9440813145 లకు సమాచారాన్ని అందించాలని కోరారు. అలాగే ఆయా సెక్షన్ల వారీగా కూకట్పల్లి ఏఈ 9440813156, ఆల్విన్ కాలనీ ఏఈ 94910617618, భాగ్యనగర్ కాలనీ ఏఈ 9440813158 లను సంప్రదించాలన్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఫ్యూజ్ ఆఫ్ కాల్ (ఎఫ్ఓసి) సెంటర్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కూకట్పల్లి సెక్షన్ పరిధిలో అంతరాయం ఏర్పడితే ఎఫ్ఓసీ.. 9490610177 నెంబర్కు ఫోన్ చేయాలన్నారు. భాగ్యనగర్ ఎఫ్ఓసి 9490610179, ఆల్విన్ కాలనీ ఎఫ్ఓసి 8331041820 ఫోన్ నెంబర్లను సంప్రదించాలన్నారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 1912 లేదా 9440 813 132 లేదా 9440 813145 ఫోన్ నెంబర్ల ద్వారా విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ముఖ్యంగా కాలనీలు, బస్తీల వారిగా ఏర్పాటు చేసుకున్న అసోసియేషన్ గ్రూపులలో విద్యుత్ లైన్ మెన్ ఫోన్ నెంబర్లను యాడ్ చేయాలని కోరారు. ఆయా కాలనీలు, బస్తీలలో విద్యుత్ సమస్యలు తలెత్తిన వెంటనే విద్యుత్ సిబ్బంది అందుబాటులోకి వచ్చి సేవలందిస్తారని తెలిపారు. ఈ సేవలను విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.