గోల్నాక (హైదరాబాద్ ) : అంబర్ పేట నియోజకర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Kaleru Venkatesh) తెలిపారు. అంబర్పేట డివిజన్ బాపునగర్ లో రూ.7లక్షల50 వేల అంచనా వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు(CC Road) పనులను స్థానిక కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్ తో కలసి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజవకర్గ వ్యాప్తంగా కొత్తగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం బస్తీలో పలు శాఖల అధికారులతో(Department Officials) కలసి ఆయన పాదయాత్ర నిర్వహించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ్ముదిరాజ్, నాయకులు లవంగు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.