Anudeep Durishetty | సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలోని ఎన్జీఓలు, శిశు విహార్ సంరక్షణ కేంద్రాల్లోని పిల్లలకు వారం రోజుల్లో అవసరమైన గుర్తింపు ధ్రువ పత్రాలను జారీ చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, మీ సేవలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి జారీ చేయాలని సూచించారు.
మధురానగర్లోని శిశు విహార్ సంరక్షణ కేంద్రంలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి బర్త్, ఆదాయం, కుల ఇతర ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. సోమవారం ఈ క్యాంపు ను కలెక్టర్ సందర్శించి 8నెలల పాపకు బర్త్ సర్టిఫికెట్ను అంద జేశారు. సంరక్షణ కేంద్రంలోని పిల్లల తల్లిదండ్రులు మరణిస్తే వారి ఆస్తులు పిల్లలకు చెందేలా రెవెన్యూ శాఖకు వివరాలు అందించాలన్నారు. జిల్లా సంక్షేమాధికారి అక్కేశ్వర్ రావు, ఆర్డీఓ సాయిరాం, డీసీపీఓ శ్రీనివాస్, తహసీల్దార్ నయూమ్ ఉద్దీన్ పాల్గొన్నారు.