Telangana Run | అమీర్‌పేట్, మే 25 : యువతలో శారీరక చురుకుదనంఫై అవగాహన కల్పించేందుకు జూన్ 8న నెక్లెస్ రోడ్లో తెలంగాణ రన్ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అవంతిక కన్స్ట్రక్షన్స్ సమర్పణలో తెలంగాణ రన్నర్స్ సొసైటీ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 8న జరగనున్న తెలంగాణ రన్ ఫినిషర్ మెడల్, టీ షర్ట్‌లను ఆదివారం బేగంపేట్‌లోని హోటల్ హరిత ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు.
ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ రన్ సమర్పకులు, అవంతిక కన్స్ట్రక్షన్స్ ఎండిం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించే నిమిత్తం ఈ రన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3కే, 5కే, 10కే, 21కే విభాగాల్లో జరుగుతున్న ఈ పోటీలకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి దాదాపు 1500 మందికి పైగా ఔత్సాహికులు ఈ రన్లో భాగస్వాములు అవుతారని తెలిపారు. మరిన్ని వివరాలకు 9849493010 ( జగన్), 9949113931 ( శ్రీకాంత్), https://runnersoftelangana.com లలో సంప్రదించాలని, ఔత్సాహికులు జూన్ 2 లోపు పైన తెలిపిన నెంబర్లలో లేదా వెబ్ సైట్ లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అబ్కారి శాఖ అదనపు కమిషనర్ ఎస్ వై. ఖురేషి, తెలంగాణ రన్ 2025 రేస్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.