Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త చెప్పింది. చర్లపల్లి (Cherlapally) నుంచి కాకినాడ (Kakinada Town) , నర్సాపూర్ (Narsapur)కు 20 ప్రత్యేక రైళ్లను (Special Trains) నడిపించనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి నెల 30 వరకు ఈ స్పెషల్ ట్రైన్స్ రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. చర్లపల్లి-కాకినాడ టౌన్ (07031) రైలు ఫిబ్రవరి 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో రాత్రి 7.20 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 4.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది. ఇక తిరుగు ప్రయాణంలో కాకినాడ టౌన్ – చర్లపల్లి (07032) మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో సాయంత్రం 6.55 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు చర్లపల్లి స్టేషన్కు చేరుకుంటుందని చెప్పింది.
చర్లపల్లి – నర్సాపూర్ (07233) రైలు ఫిబ్రవరి 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో రాత్రి 8.15 గంటలకు బయలుదేరి.. తెల్లవారి 5.50 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని తెలిపింది. తిరిగి నర్సాపూర్-చర్లపల్లి (07234) రైలు మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో రాత్రి 10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజున ఉదయం 6 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని చెప్పింది. చర్లపల్లి-కాకినాడ-చర్లపల్లి రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని పేర్కొంది. చర్లపల్లి-నర్సాపూర్-చర్లపల్లి రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, విరవసరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.