Sonam Wangchuk | ఇందిరాపార్క్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన బాట పట్టింది. నీట్ పేపర్ లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రశ్నాపత్రాల లీకేజీ,విద్యావ్యవస్థ లోపాలను లేవనెత్తుతూ ఆందోళన చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది.
ఈ నిరసన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నది.. ఈ క్రమంలో ఇందిరా పార్క్ దగ్గరర పోలీసులు భారీగా మోహరించారు. సీజేపీ ఆందోళన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు రోడ్డున పడ్డారు. పోటీ పరీక్షల పేపర్లు లీక్ చేస్తున్నారు. తాజాగా నీట్ పేపర్ కూడా లీక్ చేశారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో పర్యావరణం నశించిపోతుందన్నారు.