మల్కాజిగిరి: అభివృద్ధి పనులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి గురువారం జలమండలి ఎండీ అశోక్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మర్రి మాట్లాడుతూ.. జలమండలిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. కౌకూర్ రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో నీటి సమస్య పరిష్కరించాలని ఎండీని కోరారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాలలో బోర్వెల్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. జేఏసీ వెంకన్న, నర్సింగ్‌రావు పాల్గొన్నారు.