హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి అన్ని వైపుల నుంచి మద్దతు వస్తున్నది. మేధావులు, విద్యావంతులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్షాల యూనియన్లు అందరూ … జీవ వైవిధ్యానాన్ని కాపాడాలని గళమెత్తారు 400 ఎకరాల వర్సిటీ భూముల వేలం నిలిపివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. హెచ్‌సీయూ క్యాంపస్‌లో ప్రొఫెసర్లు, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని తీవ్రంగా ఖండించారు.
లాఠీ ఛార్జ్ దారుణం
ఉస్మానియా యూనివర్సిటీ: నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, ఓయూ ఆరట్స్ కళాశాల విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు పి శశిధర్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు మద్దతుగా ఆ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రొఫెసర్లు ర్యాలీ నిర్వహిస్తుంటే వారిపై ప్రభుత్వం పోలీసులచే అమానుషంగా లాఠీచార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద గొడ్డలి పెట్టులాంటిదని అన్నారు.
– మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి
ఇందిరమ్మ రాజ్యమంటే నిర్బంధాలేనా?
మేడే రాజీవ్‌సాగర్
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ప్రశ్నించేవారిని అణచివేయడం.. గొంతెత్తినవారిని నిర్బంధించడమే ఇందిరమ్మ పాలనా? అని తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ ధ్వజమెత్తారు. హెచ్‌సీయూ విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. యూనివర్సిటీ స్వర్ణోత్సవాల వేళ విద్యార్థులకు మేలు చేయాల్సిన సరారు భూముల అమ్మకానికి పూనుకోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. పర్యావరణానికి హాని కలిగించే చర్యలను విరమించుకోవాలని హితవు పలికారు. నాడు హెచ్‌సీయూకి వచ్చి అండగా ఉంటానని చెప్పిన రాల్గాంధీకి విద్యార్థుల ఆర్తనాదాలు వినిపించకపోవడం బాధాకరమని తెలిపారు.
తెలంగాణలో ప్రభుత్వ భూములకు రక్షణ లేదు
దుండిగల్, ఏప్రిల్ 2: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైపోయిందని, ఎవరు పడితే వారు విచ్చలవిడిగా భూములను ఆక్రమించుకుంటున్నారని చివరికి విద్యాసంస్థల భూములను కూడా వదలడం లేదని కుత్బుల్లాపూర్ మండలం సీపీఎం పార్టీ కార్యదర్శి కే లక్ష్మణ్ అన్నారు. హెచ్ సీయూ భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విద్యార్థులను, సిపిఎం పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా బుధవారం షాపూర్ నగర్ లోని రైతు బజార్ నుంచి సాగర్ హోటల్ చౌరస్తా వరకు సీపీఎం కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొద్దిసేపు రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.
హెచ్ సీయూ భూములు విక్రయించడం ఆపాలి
కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 2: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మడాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. బుధవారం ఏబీవీపీ పిలుపుమేరకు హెచ్ సీయూ విద్యార్థుల పోరాటానికి మద్దతుగా జేఎన్టీయూహెచ్ లో తరగతులను బహిష్కరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, కార్యవర్గ సభ్యులు మలిశెట్టి రిషి, యూనివర్సిటీ అధ్యక్షుడు శ్రీరామ్, లేకాజ్, అజయ్, అరవింద్, శివ ఉన్నారు.
విద్యార్థులపై దాడులు చేయడం దుర్మార్గం
– ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 2: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని నిరసిస్తూ పోరాడుతున్న విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం బాధాకరమని కూకట్పల్లి జనసేన ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ సీయూ భూములను అమ్మితేనే ఖజానా నిండుతుంది అని… పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.భూముల కోసం పోరాడుతున్న విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టడం దుర్మార్గమన్నారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడుతాం
– కిశోర్ గౌడ్
బోడుప్పల్, ఏప్రిల్ 2:హెచ్ సీయూ భూ సేకరణపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధమని ఓయూ టీఎస్ జాక్ స్టేట్ కో కన్వీనర్ వర్కల కిషోర్ గౌడ్ హెచ్చరించారు. బుధవారం బోడుప్పల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందని, పర్యావరణాన్ని, జీవవైవిద్యాన్ని దెబ్బతీసేలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను లాక్కునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. యూనివర్సిటీ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గాలని ఆయన డిమాండ్ చేశారు.