జవహర్‌నగర్, మే 10: ‘ఆందోళన వద్దు అప్రమత్తతే ముద్దు’ అని.. సంక్షోభ సమయంలో పౌరులు ఎలా ప్రవర్తిస్తే ప్రమాదాన్ని అరికట్టువచ్చని కమాండర్ విజయ్‌కుమార్ వర్మ ప్రజలకు వివరించారు. భారత్- పాక్ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరడంతో కేంద్ర హోంశాఖ సూచనల మేరకు.. ‘ఒకవేళ యుద్ధం వస్తే పౌరులు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి’ అనే అంశంపై శనివారం నగరంలోని జవహర్‌నగర్ అరుంధతినగర్‌లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో పౌరులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయ్‌కుమార్ వర్మ మాట్లాడుతూ.. శత్రు యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు దూసుకొస్తున్న వేళ ప్రజలు సన్నద్ధంతో ఎలా తప్పించుకోవాలో విన్యాసాలతో తెలిపారు. ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్లాన్ల పనితీరు, సైరన్ మోగగానే ప్రతి ఒక్కరూ లైట్లు ఆర్పేసి.. ఇంట్లో సురక్షిత స్థానాల్లో దాక్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అరుంధతినగర్ యువకులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సభ్యలు, స్థానికులు పాల్గొన్నారు.