మియాపూర్ , ఆగస్టు 19 : సాఫ్ట్వేర్ ఉద్యోగిపై కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధు గౌడ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి కేపీహెచ్‌బీ రోడ్ నంబర్ 1లో మంగళవారం రవళి అనే వ్యభిచారిణితో ఘర్షణ పడ్డాడు. రవళి సోదరుడు సోహైల్ తన గ్యాంగ్‌తో కలిసి సాఫ్ట్వేర్ ఉద్యోగి మధుపై రోడ్ నంబర్ 1లోని గాంధీ విగ్రహం సమీపంలో కత్తితో దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో మధు తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు నిందితులు రవళి, గూడెల్లి సాయికుమార్, ఎండీ సోహైల్, బారెడ్డి శశిధర్‌రెడ్డి, బారెడ్డి ప్రతాప్‌రెడ్డి, అశ్విని కుమార్ సింగ్, షేక్ షరీఫ్‌లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.