హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఉద్యోగి(Software employee) ఉరేసుకొని బలవన్మరణాని( commits suicide)కి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన కేపీహెచ్‌బీ( KPHB) పరిధి అడ్డగుట్ట సొసైటీలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే. భువన్ అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో తను ఉంటున్న వసతి గృహంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భువన్ టీఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.