తన కూతురు కంటే చిన్న వయసు ఉన్న ఓ యువతిని కాంగ్రెస్ సోషల్‌మీడియా క్యాంపెయినర్ ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెకు కడుపు చేశాడు. తీరా సదరు యువతి పెళ్లి చేసుకోమని బతిమిలాడటంతో ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హనుమంతరెడ్డి వద్ద డేవిడ్ (41) సోషల్‌మీడియా క్యాంపెయినర్‌గా పనిచేస్తున్నాడు. తనతో పాటు సోషల్‌మీడియా క్యాంపెయినర్‌గా పనిచేస్తున్న యువతి (21)ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మాయమాటలు చెప్పి ఆమెను లోబరచుకున్నాడు. శారీరకంగా వాడుకున్నాడు. ఈ క్రమంలో సదరు యువతి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని డేవిడ్‌కు చెప్పి.. తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. కానీ ఆమెను పెళ్లి చేసుకునేందుకు డేవిడ్ నిరాకరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ కేసు తమ పరిధిలోకి రాకపోవడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. రంగంలోకి దిగిన బాచుపల్లి పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి మంగళవారం నాడు రిమాండ్‌కు తరలించారు. డేవిడ్‌కు ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా డేవిడ్ కూతురి కంటే బాధితురాలి వయసు చిన్నది కావడం గమనార్హం.