Kaveri Travels | హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ ఫ్లై ఓవర్‌పై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో పొగలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నబస్సును పెద్ద అంబర్పేట్ వద్దనే డ్రైవర్ నిలిపివేశాడు. బస్సు ఓవర్ హీట్‌తో టైర్ల నుంచి పొగలు రావడంతో.. నడిరోడ్డుపైనే బస్సును ఆపేసి ప్రయాణికులను కిందకు దించాడు. ఈ క్రమంలో 26 మంది ప్రయాణికులు మంగళవారం అర్ధరాత్రి చలికి వణుకుతూ రోడ్డుపైనే ఉండిపోయారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కావేరి ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.