రౌడీ షీటర్ హత్య.. ఆరుగురు నిందితులు అరెస్టు
రౌడీ షీటర్ హత్య కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సీహెచ్ రూపేశ్ తెలిపారు. మంగళవారం కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు.
మాదన్నపేట, సెప్టెంబర్ 19 : రౌడీ షీటర్ హత్య కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సీహెచ్ రూపేశ్ తెలిపారు. మంగళవారం కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు. హఫీజ్‌బాబా నగర్‌కు చెందిన సయ్యద్ నాసీర్ అహ్మద్ ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అయితే హత్యకు గురైన రౌడీషీటర్ నాసీర్అహ్మద్ రెండు సంవత్సరాల కిందట తన స్నేహితులు ఇలియాస్, అరాఫత్‌తో పాటు మరికొంత మంది స్నేహితులతో కలిసి చత్రినాక ప్రాంతానికి చెందిన విశాల్షిండేను జహీరాబాద్‌లో హత్యచేసి జైలుకు వెళ్లాడు. ఇటీవల బెయిల్‌పై భయటకు వచ్చిన తర్వాత విశాల్ షిండే సోదరుడు ఆకాశ్షిండేకు తండ్రి బాబా షిండేను చంపుతానంటూ మెసేజ్‌లు పెట్టి బెదిరించేవాడు.
అయితే తన కొడుకును హత్య చేయడమే కాకుండా తిరిగి తనను కూడా చంపుతానని బెదిరిస్తున్న నాసీర్‌ను ఎలాగైనా హతమార్చాలి పథకం వేశాడు. అకాశ్షిండే తండ్రి బాబా షిండేతో పాటు సయ్యద్ షా, ప్రేమ్ మానే, మోహినుద్దీన్, అతర్, షేక్ హసమ్లతో కలిసి ఈ నెల 13న తెల్లవారు జామున ఇంటిముందు ఆటోలో నిద్రిస్తున్న నాసీర్ అహ్మద్‌ను కత్తులతో పొడిచి హత్యచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు బైకులు, మూడు డ్రాగర్లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఏసీపీ మనోజ్, టాస్క్‌ఫోర్స్ సీఐ బుర్ర చిట్టి, సీఐ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

