Harish Rao | బండి సాయి భగీరథ్ కేసులో సిట్ వేయడమంటే కేసును నీరుగార్చడమే.. రేవంత్ రెడ్డి లీకుల మాస్టర్ : హరీష్ రావు
Harish Rao | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ విషయంలో విచారణకు సిట్ వేయడమంటెనే కేసును నీరుగార్చడం. సీదా కంప్లైయింట్ ఉంది కదా. ఇందులో సిట్ ఎందుకు..? అసలు కంప్లైయింట్ వచ్చినాలుగు రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.
Harish Rao | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ ఓ బాలికపై లైంగికదాడి యత్నం చేసిన వ్యవహారంలో.. బండి సాయి భగీరథ్‌పై హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్)కేసు నమోదు కాగా.. విచారణకు ప్రభుత్వం సిట్‌ను కూడా ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వత తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో స్పందించారు.
ఈ విషయమై హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. బండి సాయి భగీరథ్ విషయంలో విచారణకు సిట్ వేయడమంటెనే కేసును నీరుగార్చడం. సీదా కంప్లైయింట్ ఉంది కదా. ఇందులో సిట్ ఎందుకు..? అసలు కంప్లైయింట్ వచ్చినాలుగు రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. మా బీఆర్ఎస్ నాయకులు మన్నె క్రిశాంకో, నల్ల బాలు రీట్వీట్స్ చేస్తే రాత్రి ఒంటిగంటకు వచ్చి తీసుకుపోతరా.. వాళ్లేమీ రేప్ చేయలే.. మర్డర్ చేయలే.. ఎక్స్‌లో రీట్వీట్ చేసిర్రు అంతే. దానికి ఒంటిగంట రాత్రి ఇంటికెళ్లి బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు పెట్టిర్రు. పీటీ వారెంట్లు వేసి బెయిల్ రాకుండా లోపలేసిన రేవంత్ రెడ్డి నాలుగు రోజులైనా ఓ రేప్ కేసులో ఫిర్యాదు చేస్తే ఇప్పటిదాకా నువ్వు అరెస్ట్ చేయలేదంటేనే నీ కుమ్మక్కు రాజకీయం బయటపడ్డదన్నారు.
రేవంత్ రెడ్డి లీకుల మాస్టర్..
ఇంత క్లియర్‌గా ఉన్న కేసులో నువ్వు నాలుగు రోజులైనా నువ్వు చర్యలు తీసుకోలే.. ఇప్పుడు సిట్ అంటున్నవ్.. ఇప్పటికీ రేవంత్ రెడ్డి పది సిట్లు వేసిండు. ఏ సిట్టన్నా తేల్చిందా.. ఏ సిట్టు మీదన్నా చర్యలు తీసుకున్నారా..? అని ప్రశ్నించారు. ఇక్కడ కూడా సిట్ వేయడమంటే ఉద్దేశపూర్వకంగా కుమ్మక్కై కేసును నీరు గార్చడమే. నా డౌటు.. పార్లమెంట్ ఎన్నికలు రాగానే సినిమా యాక్టర్ల టెలిఫోన్ ట్యాపింగ్ అని సిట్ వేసిండు. ఎన్నికలు కాగానే సినిమా యాక్టర్లు ఎవరిది ట్యాప్ కాలేదని ప్రభుత్వమే చెప్పిందన్నారు.
మొన్న సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో సిట్ లీకులన్నీ వచ్చినయ్. ఎన్నికలు అయిపోయినయ్ బంద్ అయింది. ఇప్పుడు బండి సంజయ్‌ను కాపాడేందుకు రేవంత్ రెడ్డి లీకుల మాస్టర్.. ఇయ్యాళ్ల పొద్దీకో రేపో మళ్లీ లీకులిస్తరు.. ఇండ్ల ఏ1 ఈయనట.. ఏ2 ఈయనట.. అని రేవంత్ రెడ్డి ఎప్పుడు అవసరముంటే దీన్ని వాడుకొని మళ్లీ లీకులు ఇస్తడు. ఎన్నికలు రాగానే లీకులు యాదికొస్తయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డిఫెన్స్ లో పడంగనే లీకులు గుర్తొస్తయి. లేదే ఏదైనా అంశాన్ని పక్కదారి పట్టియ్యాలంటే లీకులు.. ఇదంతా కూడా ఓ డ్రామా కంపెనీ.. అని హరీష్ రావు మండి పడ్డారు.
బండి భగీరథ్ విషయంలో SIT వేయడం అంటేనే కేసును నీరుగార్చడం
ఫిర్యాదు వచ్చి నాలుగు రోజులైనా ఎందుకు అరెస్ట్ చేయలేదు?
మా క్రిశాంక్, నల్లబాలు రిట్వీట్ కొడితేనే ఇంటికి వచ్చి ఎత్తుకపోయారు కదా? మరి రేప్ కేసులో ఫిర్యాదు వచ్చిన అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు?
ఇప్పటివరకు 10 SITలు వేశావు,… https://t.co/GZiOZUVSIu pic.twitter.com/8RnHL99yv3
— Telugu Scribe (@TeluguScribe) May 11, 2026
Read Also :
Kalki 2 | ‘కల్కి 2’ కోసం భారీ ప్లాన్.. 2027లో ప్రభాస్ విశ్వరూపం ఖాయమా?
Trisha Krishnan: ప్రేమ గురించి భావోద్వేగాన్ని వ్యక్తం చేసిన నటి త్రిష
Priyanka Chopra | విజయ్ను దేవుడిలా ఆరాధించేవారు .. తన ఫస్ట్ హీరో గురించి ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

