చెన్నై : ఫిల్మ్ స్టార్ త్రిష(Trisha Krishnan) ఇవాళ తన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ప్రేమ ఎప్పటికీ శక్తివంతమైందే అని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు పెట్టారు. నీలిరంగు చీరలో త్రిష ఆకట్టుకున్నది. తమిళనాడు సీఎంగా ఆదివారం విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్‌కు ఈసారీలోనే ఆమె హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన త్రిష ఇవాళ తన సోషల్ మీడియా పోస్టుతో తన భావోద్వేగాన్ని మరింత స్పష్టంగా వ్యక్తం చేశారు. చెన్నై నెహ్రూ స్టేడియంలో సందడి చేసిన నటి త్రిష.. తన పోస్టులో ప్రేమ గొప్పతనాన్ని వ్యక్తం చేశారు. రకరకాల స్టిల్స్‌తో దిగిన ఫోటోలను పోస్టు చేసిన త్రిష.. ప్రేమ ఎప్పటికీ గట్టిగానే వ్యక్తం అవుతుందన్న అభిప్రాయాన్ని ఆ పోస్టులో రాశారు. ద లవ్ ఈజ్ ఆల్వేస్ లౌడర్ అన్న క్యాషన్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఆ పోస్టులో తన స్టయిలిస్ట్ బృందానికి ఆమె థ్యాంక్స్ కూడా చెప్పింది.