Harish Rao | ఈ నెల 14వ తేదీన బుధవారం రామగుండంలో సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. సింగరేణి కార్మిక గర్జన ఈ సభకు నామకరణం చేశారు. ఈ సభలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి రోజురోజుకూ దిగజారిపోతుంది. కార్మికుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి అధికారులు కూడా రోడ్డుమీదికొచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని.. కార్మికులకు రావాల్సిన వాటా.. లాభాలను డిక్లేర్ చేయాలని లాభాల్లో పూర్తి వాటను కార్మికులకు అందించాలని మా మొదటి ప్రధానమైన డిమాండ్ అన్నారు.
కార్మికులకు ఇంటి హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్ 2019లో జీవో 76 తెచ్చారు. కానీ మేమే జీవో ఇచ్చామని కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. సింగరేణి ప్రాంతంలో 30 వేల మంది కార్మికులకు హక్కులు కల్పించి, వారి ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేసి అప్పగించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ జీవోను పక్కనపెట్టి నిషేధిత జాబితాలో చేర్చారన్నారు.
ఒక్క మంచిర్యాలలోనే వేలాది స్థలాలను నిషేధిత జాబితాలో పెట్టారన్నారు. మూడేళ్లపాటు కార్మికుల ఉసురు పోసుకున్నందుకు వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే జీవో 76 కింద మిగిలిన కార్మికులకు సేల్ డీడ్ ద్వారా హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఈ నెల 14వ తేదీన “సింగరేణి కార్మిక గర్జన” పేరిట రామగుండంలో భారీ బహిరంగ సభ ✊🏻
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ సభను నిర్వహిస్తున్నాం.
ఈ సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హాజరవుతారు.
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
— BRS Party (@BRSparty) October 8, 2026
Uttarpradesh: టీ కోసం దాబా వద్ద ఆగారు.. 8 ఏళ్ల కొడుకును వదిలేసి 80 కిలోమీటర్ల దూరం వెళ్లారు
Paddy Crop | జనరేటర్ పెడితే రోజుకు రూ.3-4 వేలు ఖర్చు.. పశువులకు మేతగా వరి పంట.. వీడియో