Paddy Crop | కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఓ వైపు సాగునీరు, మరోవైపు కరెంట్ కరువైపోయిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎల్ నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు పంటను కాపాడుకోలేక చేసేదేమి లేక బిక్కుబిక్కుమంటూ కాలమెళ్లదీస్తున్నారు. నల్గొండ జిల్లావ్యాప్తంగా కరెంట్ కోతలతో, సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి.
లక్షల రూపాయల పెట్టుబడులు మట్టిలో కలిసిపోయాయని విలపిస్తున్న రైతన్నలు తీవ్రమైన కరెంట్ కోతలతో వ్యవసాయం చేయలేక విసిగిపోయి చివరకు తాము ఎంతో కష్టపడి సాగు చేసిన వరిని పశువులకు మేతకు వదిలేస్తున్నారు.
నల్గొండ జిల్లాలో ఎండిపోయిన వరిపొలంలో నిలబడ్డ సదరు రైతు మీడియాతో మాట్లాడుతూ.. మీరు చూస్తున్నరు.. ఇందులో రెండెకరాలు ఎండిపోయింది.. ఇంకో రెండుకరాలు ఎండిపోయేందుకు సిద్ధంగా ఉంది. అవతల ఇప్పటికే మూడెకరాలు ఎండిపోయింది. నీళ్లున్నయి.. అన్నీ ఉన్నయి.. కానీ ప్రారంభదశలో పిలగాడు పుట్టగానే పాలు, పండ్లు తెస్తే తినలేడు కదా.. ఒక వయస్సులో పెట్టనిది.. నువ్వు చిన్నతననా ఎన్ని పెట్టినా దండగే అన్నా. ఇప్పుడు తినే వయస్సు.. తాగే వయస్సు.. ఇప్పడు నీళ్లు తాగే వయస్సులో పంటకు కరెంట్ కోతలతో నీరు లేక ఎండిపోతుంది. ఏది కావాలన్నా పొట్ట దశలోనే.. జనరేటర్ పెట్టుకుంటే రోజుకు దాదాపు 3-4 వేలు ఖర్చు వస్తుందని వాపోయాడు. చేసేదేమి లేక పశువులకు మేతగా వాడుతున్నట్టు వాపోయాడు.
ఎండిపోయి పశువులకు మేతగా మారుతున్న పంటలు
నల్గొండ జిల్లా వ్యాప్తంగా కరెంట్ కోతలతో, సాగు నీరు అందక ఎండిపోతున్న పంటలు
లక్షల రూపాయల పెట్టుబడులు మట్టిలో కలిసిపోయాయని విలపిస్తున్న రైతన్నలు https://t.co/FL3DUWe3d6
— Telugu Scribe (@TeluguScribe) October 8, 2026