Jagityal | జగిత్యాల, అక్టోబర్ 8 : ఎంతో మంది పెన్షనర్లు వయో భారంతో మృతి చెందుతున్నారని, అందుకే ప్రభుత్వం మంజూరు చేసిన రెండు డీఏలను నాలుగు వాయిదాల్లోనే చెల్లించాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ ప్రభుత్వం ను కోరారు. అసోసియేషన్ కార్యాలయంలో జిల్లా స్థాయి పెన్షనర్ల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి పీసీ హన్మంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి డీఏ బకాయిలు 33 నెలల వాయిదా, రెండో డీఏ బకాయిలు 27 నెలల వాయిదా లో చెల్లిస్తామని పేర్కొనడం సరైనది కాదని, పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థిక నష్టం కలుగుతుందన్నారు.
మిగిలిన పెండింగ్ డీఏ లను త్వరితగతిన విడుదల చేయాలని, ఉద్యోగుల, పెన్షనర్ల ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎస్జీపీఏటీ జిల్లా అధ్యక్షుడు పీ అశోక్ రావు, టీపీసీఏ జిల్లా సహాయ అధ్యక్షుడు బొల్లం విజయ్, ఉపాధ్యక్షులు ఎండీ యాకూబ్, విజయ లక్ష్మి, కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి బీ కరుణ, కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం, మెట్ పల్లి అధ్యక్షుడు కుందేళ్ల మురళి, జగిత్యాల యూనిట్ అధ్యక్షుడు బీ రాజేశ్వర్, మల్యాల అధ్యక్షుడు రెవిన్యూ యాకూబ్, కార్యదర్శి వీరారెడ్డి, రాయికల్ అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు.